నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
సిరికొండ మండలం వర్జిన్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం ఎన్నిక కావడంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సిరికొండ మండలం వర్జిన్ తండా సర్పంచ్ గా బాణావత్ బుజ్జి మోజిరం నాయక్, ఉపసర్పంచ్ గా బాధవత్ మోహన్, 1వ వార్డ్ మెంబెర్ సరోజ, 2వ వార్డ్ సభవత్ బాధవత్ రమేష్, 3 వ వార్డ్ బాధవత్ హిర-శర్మ, 4వ వార్డ్ బాణావత్ పద్మ, 5వ వార్డ్ బాణావత్ మోజిరం, 6వ వార్డ్ మోహన్, 7వ బాణావత్ దేవ్, 8వ వార్డ్ బాధవత్ లక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తండా నాయక్, కారోబార్లు, వీడీసీ చైర్మన్, దేవాదాయ కమిటీ,కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,రూరల్ యువజన అధ్యక్షులు మహేందర్, పీఏసీసీ చైర్మన్ తుంపల్లి రాంలునాయక్, కాంగ్రెస్ నాయకులు, తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
