27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇద్దరు దోంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

. . . దొంగ సొత్తు కొనుగోలు చేసిన మరో ఇద్దరి అరెస్ట్

. . . 70 గ్రాముల బంగారం తో పాటు వెండి వస్తువుల స్వాధీనం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురి ఇండ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరిని, చోరి సొత్తును కొనుగోలు చేసిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్లు నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ…. ఈ నెల 8న ఖానాపూర్ చౌరస్తా వద్ద రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ బైక్ పై నిర్మల్ జిల్లా బైంసా కు చెందిన అహ్మద్ హుసేన్, అబుబకర్ అనే వ్యక్తులు అనుమానస్పదంగా వస్తుండగా పట్టుకుని విచారించారు. ఇద్దరు  వ్యక్తులు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండ్లలో చోరీలకు పాల్పడిన తప్పించుకు తిరుగుతున్నట్టు పోలీస్ విచారణ లో అంగీకరించారు. చోరి సొత్తును బైంసా కు చెందిన నాంపల్లి వెంకట చారి, నాంపల్లి సాయి చరణ్ లకు విక్రయించినట్లు తెలిపారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 70 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, చేతి గడియారాలు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ తెలిపారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.

More articles

Latest article