30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పేదింటి బిడ్డకు ఎస్సీ కేటగిరిలో జిల్లాలో ఒకటో ర్యాంకు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ని దళితవాడకు చెందిన మచ్కురి గంగారం, సుశీల కుమారుడు జ్ఞానేశ్వర్ కు డి ఎస్ సి పరీక్ష లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో జనరల్ కేటగిరీలో 11 వ ర్యాంకు, ఎస్సీ క్యాటగిరిలో జిల్లాలో మొదటి ర్యాంకు రావడంతో కాలనీవాసులు పలువురు జ్ఞానేశ్వర్ ను అభినందిస్తున్నారు. ఒకటి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ భారతరత్న జూనియర్ కళాశాల, బాన్సువాడ డిగ్రీ గిరి రాజ్ కళాశాలలో, బిఎడ్ కాలేజీలో పూర్తి చేశానని జ్ఞానేశ్వర్ తెలియజేశాడు. తన తల్లిదండ్రుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల అభ్యుదయం కోసం కృషి చేస్తానని పేర్కొన్నాడు.

More articles

Latest article