27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్సై పి.సాయన్న

 

రుద్రూర్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య  ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబం(ఆర్) గ్రామ శివారులోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో సైబర్ మోసాల పై, రోడ్డు భద్రత నియమాలు, మహిళల రక్షణ, మాదక ద్రవ్యాలు, సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాల పై విద్యార్థులకు నాటికలు, పాటల రూపంలో వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలు అందించారు. ఈ సందర్బంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత మాదకద్రవ్యాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు కళాబృందం, కళాశాల ఉపాధ్యాయుని బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article