27.5 C
Hyderabad
Friday, July 31, 2026

డిజిటల్ అరెస్ట్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :   డిజిటల్ అరెస్ట్ కేసులో పండు వినీత్ రాజ్, తిరుపతయ్య, గౌని విశ్వనాథామ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై దేశవ్యాప్తంగా ఐదు కేసులుండగా, వాటిలో తెలంగాణలోనే 2 కేసులు ఉన్నాయి. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను పండు వినీత్ రాజ్ సమకూర్చగా.. జాయింట్ హోల్డర్లుగా తిరుపతయ్య, విశ్వనాథం ఉన్నారు. సీబీఐ అధికారుల పేరిట ఫోన్ చేసి బాధితుడి నుంచి రూ.1.92 కోట్లు వీరు కాజేశారు. ఆధార్ దుర్వినియోగంతో కేసు నమోదైందని బెదరించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సందీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More articles

Latest article