25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎఫ్ఐఆర్లో పేరు నమోదైతే భవిష్యత్ నాశనం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :   ఒకసారి ఎఫ్ఐఆర్లో పేరు నమోదైతే భవిష్యత్ నాశనం అవుతుందని, భవిష్యత్ బంగారుమయం చేసుకోవాంటే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఆదివారం నిర్వహించిన ’సంవిధాన్ శక్తి‘ పేరిట రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏక్ నయా దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3కే, 5కే రన్ నిర్వహించారు. ఈసందర్భంగా జస్టిస్ నగేశ్ భీమపాక మాట్లాడారు. డ్రగ్స్ పెడ్లర్ గా యువతను మార్చడమే లక్ష్యంగా కొన్ని ముఠాలు ఉంటాయి. యువత వాటి బారిన పడొద్దన్నారు. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More articles

Latest article