28.2 C
Hyderabad

ర్యాలీలు, డీజేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్సై పి.సాయన్న

 

రుద్రూర్, బతుకమ్మ :  గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాలలో ఎటువంటి ర్యాలీలు, డిజేలు నిర్వహించరాదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై పి.సాయన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీ నిర్వహించాలనుకుంటే సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పోలీసుల అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే మొదటి సారి 10,000 రూపాయలు, రెండవసారి 15,000 రూపాయలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని వెల్లడించారు.

More articles

Latest article