27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో భాగంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ లను గురువారం నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బినోల గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రం ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకొని, పోలీస్ సిబ్బంది కి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ ఎస్సైలు తిరుపతి యాదగిరి గౌడ్, ప్రొసీడింగ్ ఆఫీసర్ కె.అనిత, సిబ్బంది పాల్గొన్నారు.

Police Commissioner inspects election nomination process

More articles

Latest article