29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జంక్ ఫుడ్ తీసుకోవద్దు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: అనారోగ్యాన్ని కలిగించే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని కావున వాటిని దూరపరచాలని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకి ఇంటిలో తయారు చేసిన ఆహార పదార్థాలు పిల్లలకి ఇవ్వాలని ఆమె తెలియజేశారు. విద్యార్థులు తీసుకువచ్చిన వివిధ రకాల ఆహార పదార్థాలను ఆమె రుచి చూశారు. అనంతరం సదా మస్తుల రాములు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులకు చెక్కులను అందజేశారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల రాణి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article