23.4 C
Hyderabad

కలెక్టరేట్ లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన – వీటి స్వాతంత్య్రమును, అంతస్తులోనూ, అవకాశంలోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలోనూ వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని’ ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Constitution Day Pledge at the Collectorate

More articles

Latest article