ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న ‘సంవిధాన్ దివస్’ జరుపుకుంటామన్నారు. 1949 నవంబర్ 26న, భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు.ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది ఉన్నారు.
