బాల్కొండ, బతుకమ్మ:బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముప్కాల్ మండలానికి సంబందించిన సుమారు 24 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ లను పంపిణి చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో కేసీఆర్ పేద వారి ఇంటిలో ఆడబిడ్డ పెళ్లి అయితే ప్రభుత్వం తరపున అండగా ఉండడానికి అయన స్వీయ అనుభవం ద్వారా పుట్టింది ఈ పథకం అన్నారు. మొదట Sc లకు తర్వాత BC లకు తర్వాత పేదవారు ఎ వర్గంలో ఉన్న ఈ పథకాన్ని వర్తింప జేసీ 50 వేల నుండి మెదలు పెట్టి 100116 రూపాయలు మేనమామ కట్నం కింద కేసీఆర్ అందజేశారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఆ పార్టీ కి ఓట్లు వేశారు. అధికారంలో కి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అవుతుంది. మేము అధికారంలోకి వస్తే లక్ష తో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రెండేండ్లు అయినా తులం బంగారం హామీ ఇంకా నెరవేర్చలేదు. మేము మీ తరపున అసెంబ్లీలో అడిగిన ఈ ప్రభుత్వం పట్టించుకోవటము లేదు తులం బంగారం, మహిళలకు 2500 మరియు పెన్షన్ 4000 రూపాయల హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లు వస్తున్నాయని చీరల పంపిణి ద్వారా మళ్ళీ మహిళలను మోసం చేయాలనీ రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. మహిళా సోదరీమణులు గమనించాలని, ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికలో బుద్ది చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హమీ ఇచ్చిన విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ లు అందుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి మరియు ఇప్పుడు కొత్తగా మంజూరైనా లబ్దిదారులకు లక్ష రూపాయల చెక్ తో పాటు తులం బంగారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా ఎమ్మెల్యే డిమాండ్ చేసారు.కొత్తగా మంజూరు కావాల్సిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 199 బ్యాచ్ ఫైల్స్ పై సంతకాలు చేసిన ఎమ్మెల్యే వేముల మంజూరు కోసం సిద్ధంగా ఉన్న కమ్మర్పల్లి (63), బాల్కొండ (54), ముప్కాల్ (15), మోర్తాడ్ (49), రుద్రంగి (18) మండలాలకు చెందిన మొత్తం 199 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంతకాలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..ఈ సందర్బంగా ఫైల్స్ మీ వద్ద పెండింగ్ ఉంచుకోకుండా త్వరితగతిన సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని తహషీల్దార్ ను అదేశించారు.
