29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్, బిఆర్ఎస్ తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశాయి

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక దళ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణకు తీవ్రమైన ద్రోహం చేశాయని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్యం ఉపాధి వంటి కీలక వ్యవస్థలు రెండు పార్టీల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నారు. 28 లక్షల వృత్తి నైపుణ్య శిక్షణలు పూర్తి చేయాలని ఇందుకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజనులకు రాజకీయ అధికారం వస్తుందని, రాష్ట్రీయ లోక్ దళ్ యువతను రాజకీయాల్లోకి రాబోయేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెందవలసిన లాభాలను ప్రభుత్వం దారి మళ్ళించడాన్ని తీవ్రమైన అన్యాయంగా అభివర్ణిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పు కూడా పొందలేని దశకు చేరడం రేవంత్ రెడ్డి అసమర్థ పరిపాలన కారణమే అని విమర్శించారు. బీసీలకు 42 శాతం చట్టబద్ధ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నది ఆర్ ఎల్ డి డిమాండ్ అని తెలిపారు. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ శంకర్, బిజెపి నాయకులు గౌరప్ప, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మడకం ప్రసాద్, దొర రిషబ్, నరసింహారావు, బుల్లెట్ వెంకన్న, కళాబృందం, రాష్ట్ర టీఆర్ఎల్ డి నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article