27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయాలు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, మోదీ గుజరాత్ కు ఇచ్చిన సహకారాన్నే మేం తెలంగాణకు ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హోటల్ ఐటీసీ కోహినూర్ లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లడారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీంతో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మోదీ గుజరాత్ మోడల్ తీసుకొస్తే.. మేం తెలంగాణ మోడల్ తీసుకొచ్చామన్నారు. గుజరాత్ లో సబర్మతి నది ప్రక్షాళన చేపడితే మేం మూసీ పునరుజ్జీవం చేస్తున్నామన్నారు.  తెలంగాణ రైజింగ్ -2047 పేరు ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ కూడా భాగమవుతుందన్నారు.

More articles

Latest article