23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • ప్రజావాణికి 101 ఫిర్యాదులు

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, డీపీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా, మహిళా, శిశు, వయో వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులను ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Complaints should be resolved promptly.

More articles

Latest article