31 C
Hyderabad

ఆదివారం ఆటవిడుపుగా..

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: ఆదివారం సెలవు రోజు కావడంతో ఆటవిడుపుగా ప్రాజెక్టు అందాలని తిలకించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. దీంతో ప్రాజెక్ట్ కు పర్యాటక శోభ సంతరించుకుంది. ప్రాజెక్టు జల దృశ్యాలను, గోదావరి పరవాళ్ళు, ప్రాజెక్టు అందాలను తిలకిస్తూ చరవాణిలో సెల్ఫీలు దిగుతూ సంతోషంగా సేద తీరారు. స్థానిక నిజామాబాద్ జిల్లా ప్రజలే కాకుండా నిర్మల్, అదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి పర్యాటకులు రావడం జరిగింది.

  • నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 9355 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సరస్వతీ కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 800 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఆదివారం సాయంత్రం 1091.00 అడుగులు, 80.501 నీరు నిల్వ ఉంది.

More articles

Latest article