28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మరోసారి హరీశ్ రావు టార్గెట్‌గా కవిత విమర్శలు

Must read

📰 Generate e-Paper Clip

మెదక్, బతుకమ్మ :  మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమం కొనసాగుతుంది.   మరోసారి హరీశ్ రావు టార్గెట్‌గా కవిత విమర్శలు గుప్పించారు. రెడ్డిపల్లిలో 400 ఎకరాల ఫాంహౌస్‌ కట్టారని, ఇందుకోసం రీజినల్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపించారు. దీంతో  56 మంది రైతుల 59 ఎకరాలు పోతున్నాయని, ఇందులో ఎకరం, అర ఎకరం ఉన్న చిన్న రైతులు ఉన్నారని పేర్కొన్నారు.  కేసీఆర్‌ కళ్లకు గంతలు కట్టి హరీశ్ రావు  ఇలా చేశారని కవిత వ్యాఖ్యనించారు. కాగా, కవిత ’ఎక్స్‘ వేదికగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితంపై ’కర్మ హిట్స్ బ్యాక్‘ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయంశమైన విషయం తెలిసిందే.

More articles

Latest article