హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ విషాదం చోటు చేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. అక్టోబర్ 22 న ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల ఫలితాలపై ఆసక్తి, ఒత్తిడి, అన్వర్ ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు అనుమానిస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా అన్వర్ ఆకస్మిక మరణంపై సంతాపం తెలిపాయి.
