24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పరిశీలించారు.కలెక్టర్ ఆదేశానుసారం కమిషనర్ గురువారం పట్టణంలోని వివిధ వార్డులల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ మీకు నిర్మాణం పనుల్లో ఏమైన సమస్యలుంటే వార్డు ఆఫీసర్లకు తెలియజేయాలన్నారు. ఇండ్ల నిర్మాణం పనిని తొందరంగా పూర్తి చేయించాలని వార్డు ఆఫీసర్లను ఆయన ఆదేశించారు.అటు మేస్త్రీలతో, ఇటు లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణం పనులు ఆగకుండా చర్యలు తీసుకోవాలని కమీషనర్ సూచించారు. అనంతరం శ్రీ శ్రీనివాస కళ్యాణం,కోటిదీపోత్సవం నిర్వహించనున్న వేదిక వద్ద జరుగుతున్న శానిటేషన్ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మేనేజర్, వార్డ్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

Inspection of Indiramma's houses

More articles

Latest article