29 C
Hyderabad
Monday, August 3, 2026

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 8 మందికి జైలు శిక్ష 

Must read

📰 Generate e-Paper Clip

. . . 13 మందికి భారీ జరిమానా

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: 

 

మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ 21 మందిలో 13 మందికి జరిమానా విధించగా, 8 మందికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. మద్యం తాగి పట్టుబడ్డ వారిని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం  కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ఎదుట హాజరుపరచగా 13 మందికి ఒక్కొక్కరికి 10, 000/- చొప్పున మొత్తం 1,30,000/- జరిమానా విధించగా 8 మందికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. వారిలో మందముల నాగరాజు, ఐలా సుదీర్ కుమార్, మరోటి బస్వంత్, దూలండి దినేష్, గుర్రాల గంగాధర్, చవాన్ ప్రకాష్ లకు ఏడు రోజులు జైలు శిక్ష విధించారు. అలాగే బస్వారాజ్ కేంద్రీ 5 రోజులు, తులిసాకు ఓబుళరెడ్డి ప్రసాద్ 4 రోజులు జైలు శిక్ష విధించినట్లు సిఐ ప్రసాద్ తెలిపారు.

More articles

Latest article