27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అల్ఫ్రాజోలం దందా

Must read

📰 Generate e-Paper Clip

  • నార్కోటిక్స్ కే పట్టుబడుతున్న నిషేదిత మత్తు పదార్థం
  • ఎక్సైజ్ కళ్ళుగప్పి సరఫరా అవుతున్న కల్తీకల్లు రా మెటీరియల్
  • సూత్రదారులు మినహా పట్టుబడుతున్న పాత్రదారులు

నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కృత్రిమకల్లు తయారిలో వాడే నిషేదిత మత్తు పదార్థం విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. కుటీర పరిశ్రమ మించిపోవడంతో కల్తీకల్లు తయారి సొసైటీ ముసుగులో ప్రజలను మత్తుకు బానిస చేస్తోంది. దానికోసం కల్లు పరిశ్రమపై ఆధారపడిన నిర్వాహకులు నిషేదిత మత్తుపదార్థమైన అల్ర్పాజోలంను వినియోగించి మత్తు కల్లును తయారు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 400పైచిలుకు కల్లుబట్టిలలో మత్తు పదార్థాలతో తయారైన కల్లును విక్రయిస్తున్నారు. దాని కోసం డేంజర్ డ్రగ్ గా పేరొందిన అల్ర్పాజోలంను వినియోగిస్తున్నారు. కిలోకు రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ ను కేవలం మత్తు కోసమే ప్రజలకు అలవాటు చేసే ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీం ద్వారా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. అంతకు ముందే జిల్లాలో టీఎస్ న్యాబ్ ద్వారా దాడులు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. బుధవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పరిధిలో నార్కోటిక్స్ విభాగం దాడులు నిర్వహించి నిషేదిత అల్ర్పాజోలంను పట్టుకుంది.
గడిచిన నెల చివరి వారంలో మోపాల్ మండల కేంద్రం వద్ద నార్కోటిక్స్ అధికారులు అరకిలో నిషేదిత అల్ర్పాజోలంను పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ళలో సాయిచైతన్య కూడా నిషేదిత మత్తు పదార్థాలపై నజర్ వేశారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని బోధన్ మండలం సాలురా వద్ద పెద్ద ఎత్తున అల్ర్పాజోలంను పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి బల్క్ డ్రగ్ ను సేకరించి జిల్లాకు రవాణా చేస్తున్న ముఠాను నార్కోటిక్స్ అధికారులు చేదించారు. ఆనాడు మహారాష్ట్రకు చెందిన సంబంధిత బల్క్ డ్రగ్ నిర్వాహకులను పట్టుకోగా సాలురా వాసిని కూడా అరెస్టు చేశారు. అయితే నిజామాబాద్ మోర్తాడ్ కు చెందిన కల్లు ముస్తేదార్లు మాత్రం తప్పించుకున్నారు. ఆనాటి నుంచి పరారీలో ఉన్న వారిని పోలీసు శాఖ నార్కోటిక్స్ వేట కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అల్ర్పాజోలంను పట్టుకున్నారు. ఎడపల్లి మండలం ఠాణాకాలన్ కు చెందిన వ్యక్తి వద్ద డేంజర్ డ్రగ్ ను గుర్తించినా దాని వెనుక గ్రూప్ ల మధ్య విభేదాలతోనే బట్టబయలైనట్లు గుర్తించారు. తర్వాత కాలంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రోవిజన్ స్టోర్ వ్యాపారిని పట్టుకుని అతని వద్ద అల్ర్పాజోలంను పట్టుకున్నారు. కిరాణా దుకాణం వ్యాపారం మాటున జరుగుతున్న దందా అందరినీ షాక్ కు గురి చేసింది.
నిజామాబాద్ జిల్లాలో చాలా మంది మత్తు పదార్థాల రవాణా దందాలో ఆరితేరిపోయారు అనే కంటే వారికి పోలీసు, ఎక్సైజ్ అధికారుల అండదండాలు ఉన్నాయని చెప్పాలి. అందుకే నిత్యం లక్షల లీటర్ల కల్లు తయారవుతున్న అందులో నిషేదిత మత్తు పదార్థాలు వినియోగిస్తున్న కేసుల నమోదుకు మాత్రం అధికారులకు చేతకావడం లేదు. కల్లులో తయారికి వినియోగించే మత్తు పదార్థాన్ని ల్యాబ్ ల్లో గుర్తించలేకపోతున్నామని చెబుతూ పరోక్షంగా సహకరిస్తున్నారని చెప్పాలి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని గాంధారిలోని ముథేల్లి, నస్రుల్లాబాద్ మండలం దుర్కిలో కల్తీకల్లు భారీన పడి కేసులు నమోదైన ఇప్పటికి అక్కడ కృత్రిమ కల్లు ఏరులై పారుతుంది. అడపాదడపా టీఎస్ న్యాబ్ (నార్కోటిక్ అధికారులు) దందా వ్యవహరాలు వెలుగులోకి వచ్చాయి.

More articles

Latest article