24 C
Hyderabad
Sunday, August 2, 2026

ముగ్గురికి జరిమాన

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులకు కౌన్సెలింగ్ చేసి బుధవారం కోర్టు ముందర హాజరు పరచడం జరిగిందని మోర్తాడ్ ఎస్సై రాము తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం  మద్యం సేవించి  డ్రైవింగ్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పట్టుబడిన అంగలి కిషన్ గౌడ్ బట్టాపూర్, తోర్లికొండ బాజాన్న  సుంకేట్, మాదారం రాజేష్ రెడ్డి మెట పల్లీ వీరికి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్  గట్టు గంగాధర్ మోటార్ వాహన సవరణ చట్టం 2019 ప్రకారం ప్రతి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున జరిమానా విధించారని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలందరూ చట్టాలను పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని ఎస్సై కోరారు.

More articles

Latest article