24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా కమల్ షా బియాబాని ఉర్సు ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : 

 

నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో గల హజ్రత్ కమల్ షా బియాబాని (ఆర్ఏ)లో ఉర్సు ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆల్ హజ్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ సజ్జదే నషీన్ ఇంటి నుంచి సందల్ చాదర్ తీసుకుని కంఠేశ్వర్ ప్రాంతంలో ఊరేగించారు. ఈ  ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ఈ ఊరేగింపులో దారి పొడవున భక్తులు దర్శించుకుని భక్తితో ప్రార్థనలలో మునిగిపోయారు. ఊరేగింపు తిరిగి రాత్రి దర్గాకు చేరుకుని సందల్ మాలి చేశారు. అనంతరం సమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాకు చెందిన మహ్మద్ ఖాదర్ వంశస్తులు అందరూ కలిసి ఆల్ హజ్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ను సజ్జదే నషీద్ గా ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో ఖాజామొయినుద్దీన్, జహీర్, హైమద్ ఆలీ, ఎం.ఏ.ఆఫీజ్, మోయిజ్, ఎం.ఏ.ఖదీర్, నసీయొద్దీన్, సమీర్ తదితరులున్నారు.

Kamal Shah Biyabani's Urs celebrations in grand style

More articles

Latest article