26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఇంటర్ బోర్డ్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్

 

ఆర్మూర్, బతుకమ్మ : ఇంటర్ బోర్డు రూపొందించిన నియమ నిబంధనలను పట్టించుకోకుండా అతిక్రమించిన వారిపై  చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆర్మూర్ లోని ఆర్మూర్  ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సి . వి. రామన్ జూనియర్ కళాశాల,  సాయి ఒకేషనల్ జూనియర్ కళాశాల, సాంఘిక  సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు, బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇంటర్ బోర్డ్ నిబంధనల మేరకు అన్ని ఫైల్ లు, విద్యార్థుల  గ్రూపులు, సబ్జెక్ట్ లు, సరిగా చెక్ చేసుకున్న తర్వాతే పరీక్ష ఫీజులు వసూలు చేయాలని అన్నారు.  ప్రైవేట్ కళాశాలలో బోర్డు ప్రకటించిన పరీక్ష ఫీజుకంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి హెచ్చరించారు. ఈ సందర్భంగా కళాశాలలో తరగతుల నిర్వహణ అధ్యాపకుల, సిబ్బంది పనితీరును పర్యవేక్షణ చేశారు. తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని  ప్రయోజకులుగా మారాలని  విద్యార్థులకు ఉష్ణోదించరు.  కళాశాలలో ప్రిన్సిపాల్ లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సమయపాలన పాటించాలని  ఆదేశించారు. అటెండెన్స్  ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారానే నిర్వహణ చేయాలని అన్నారు. విద్యార్థులకు నవంబర్ నెలలోనే సిలబస్  పూర్తి చేసి ప్రయోగ తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు గమనిస్తూ కళాశాలకు  హాజరుకాని విద్యార్థులను రప్పించేందుకు ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు కృషి చేయాలని ఆదేశించారు. రానున్న వార్షిక పరీక్షలకు మంచి ఫలితాలను సాధించేందుకుగాను ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ  చదువులో వెనుకబడిన విద్యార్థులు గుర్తించి అందరూ ఉత్తీర్ణులయ్యే  విధంగా బోధన కొనసాగించాలని అన్నారు.

Actions for violating Inter Board rules

More articles

Latest article