29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సిటీ పోలీసు యాక్టు కింద ముగ్గురు మహిళలపై కేసు

Must read

📰 Generate e-Paper Clip

  • రెండు రోజుల జైలుశిక్ష విధింపు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాలల్లో బహిరంగ ప్రదేశాల్లో రోడ్డున వెళ్తున్న పురుషులను, ప్రయాణికులను రెచ్చగొడుతూ న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలపై సిటీ పోలీసు యాక్టు కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. నగరంకు చెందిన కళావతి, కర్రోళ్ల లత, బాత దుర్గ అనే మహిళలు బుధవారం రాత్రి బస్టాండ్ ప్రాంతంలో న్యూసెన్స్ చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గురువారం వారిని స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ఎదుట హాజరుపర్చగా ముగ్గురికి రెండు రోజుల జైలుశిక్ష విధించినట్లు తెలిపారు. ఎవరైనా న్యూసెన్స్ చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ హెచ్ వో తెలిపారు.

More articles

Latest article