ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని గ్రామాలలో మహిళలు భక్తిశ్రద్ధలతో తులసి పూజలు నిర్వహించారు. ఇందల్వాయి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి మందిరంలో ఘనంగా తులసి పూజలు చేశారు. తులసి చెట్టుకు నైవేద్యం సమర్పించి అక్షింతలు సమర్పించారు.తులసి పూజలు శుభపరిమానమని మహిళలు తెలుపుతూ ఉంటారు. కుటుంబాలలో అంత మంచే జరిగి అందరు సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని తులసమ్మ ప్రార్థించినట్లు తెలిపారు. తులసి పూజ యొక్క ప్రాముఖ్యత, విధానం ఇటీవల జరిగిన పండుగల గురించి ముఖ్యంగా,తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి, ప్రతిరోజూ పూజించాలని కార్తీక మాసంలో తులసి వివాహం క్షీరాబ్ధి ద్వాదశి వంటి పండుగలను ఘనంగా నిర్వహించాలని శాస్త్రాలు తెలుపుతుంటాయి.

