28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంను కలిసిన సలహాదారు సుదర్శన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  • శుభాకాంక్షలు తెలిపిన సీఎం

 

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో పి. సుదర్శన్ రెడ్డి  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని జుబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి సతీమణితో సహా సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ సహకార కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, డీసీసీబీ చైర్మన్ కుంటా రమేష్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నగేష్ రెడ్డి, సునీల్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Advisor Sudarshan Reddy meets the CM

More articles

Latest article