27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన సునీల్ కుమార్

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: అకాల వర్షం కురిసిన కారణంగా తడిసిన ధాన్యాన్ని శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆయన పర్యటించి తడిసిన ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారులతో చరవాణిలో మాట్లాడి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తడిసిన వరి, మొక్కజొన్న, సోయా తదితర పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, రవి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article