డిల్లీ, బతుకమ్మ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. వాయు సేన చీఫ్ మార్షల్ ఏపీసింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈఏడాది మే నెలలో పాకిస్థాన్ పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో రఫేల్ జెట్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గతంలో ద్రౌపది ముర్ము 2023లో అస్సాంలోని తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోర్ -30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించారు. ఈప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు పొందారు.
