28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 28, 29 తేదీలలో బోధన్ పట్టణంలో నిర్వహించే సీఐటీయూ జిల్లా 11వ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ సిఐటియు జిల్లా మహాసభలు అక్టోబర్ 28 29 తేదీలలో బోధన్ పట్టణంలో  నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీరమ, జె.వెంకటేష్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల్లో సీఐటీయూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. రాష్ట్ర, జిల్లా నలుమూలలా విస్తరించి వుంది. బీడీ పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థలతోపాటు అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయితీ, మద్యాహ్న భోజనం, ఐకపీ, వీవోఏ, మున్సిపల్, గ్రామ పంచాయతి, ఎల్ఐసీ, బ్యాంక్, రైల్వే, బీఎస్ఎన్ఎల్, మెడికల్ & హెల్త్, మెడికల్ రిప్స్, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, డైలీ వేజెస్. అసంఘటిత రంగంలోని అన్ని రకాల హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు. బార్ధాన్ కార్మికులు, ఆర్టీసీ, ఆటో, జీపు, లారీ, డిసిఎం, బస్సు తదితర ప్రైవేట్ ట్రాన్స్పోర్టు కార్మికుల వివిధ రకాల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నది. కార్మిక, కర్షక ఐక్యత, సామాజిక న్యాయం, జిల్లా సమగ్రాభివృద్ధికై, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నిరంతరం కార్మికవర్గ ఐక్యతకు సీఐటీయూ కృషి చేస్తున్నది. జిల్లాలో పలు ప్రమాదాల్లో గాయపడిన, మరణించిన వారి కుటుంబాల తరపున పోరాడి యాజమాన్యాలనుండి నష్టపరిహారాలు ఇప్పిస్తున్నది. కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఆందోళనలు చేసి పరిష్కారానికి కృషి చేస్తున్నది. ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం మార్పుచేసి 4 లేబర్ కోడ్లుగా తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా జులై 9న దేశవ్యాప్త సమ్మెలో 40 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల బహుళజాతి సంస్థలు, కార్పోరేట్ శక్తులు మాత్రమే లాభపడుతున్నాయి. వీటి ప్రభావం వల్ల ప్రజలు చిన్న, మధ్యతరగతి కూడా ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ నిరంతరం రైతు, వ్యవసాయ కార్మికులని కలుపుకొని పోరాడుతున్నది. ఈ నేపథ్యంలో అఖిల భారత, రాష్ట్ర, జిల్లా మహాసభ జరగబోతున్నాయి. నిజామాబాద్ జిల్లా 11 వ మహాసభలు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో 2 రోజులపాటు నిర్వహిస్తున్నాం. ఈ మహాసభలో మూడు సంవత్సరాలు జరిగిన కార్మికుల పోరాటాల గురించి చర్చించి రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పైన చర్చించి. రూ పోరాటాలను రూపొందిస్తుంది. మహాసభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సిఐటి జిల్లా నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article