- బాన్సువాడలో ఉపఎన్నికలు వస్తే పోచారానికి డిపాజిట్ రాకుండా చేస్తాం
- మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించరు. మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి మాట్లాడూతూ.పోచారం శ్రీనివాస్ రెడ్డి.ఆయన రాజకీయ లబ్ధి, స్వార్థం కోసమే పార్టీ మారారు, నియోజకవర్గ ప్రజల కోసం కాదు అనీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజల కోసం సీఎం వద్దకు వెళ్లావంటే పార్టీ మారినట్టే కదా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. సన్నవడ్లకు బోనస్, రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు.
- పోచారం రెండు మాటలు మాట్లాడూతున్నారు..
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏపార్టీలో ఉన్నారో తెలియక బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారని, అభివృద్ధి కోసం పార్టీ మారానని ఒకసారి, పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్‌కి మరోసారి తెలపడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు.
- బాన్సువాడలో ఉపఎన్నికలు వస్తే పోచారానికి డిపాజిట్ రాకుండా చేస్తాం..
రెండేళ్లుగా రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడలో ఉపఎన్నికలు వస్తే పోచారానికి డిపాజిట్ రాకుండా చేస్తామని చెప్పారు.కేసీఆర్ ఆదేశాలతో బాన్సువాడ నియోజకవర్గంపై దృష్టి పెట్టానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్, మాజీ రైతు బందు జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి,సీనియర్ నాయకులు నార్ల రత్న కుమార్, మూచి గణేష్, సాయిబాబా, బోడ రామచందర్, నాయిని మొగులయ్య, గులిపల్లి మొగులయ్య, నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.
