24 C
Hyderabad
Sunday, August 2, 2026

నెగ్గిన పొలిటికల్ ప్రెషర్

Must read

📰 Generate e-Paper Clip

  • కమిషనరేట్ పరిధిలో ఐదు నలుగురు సిఐ ల బదిలీ
  •  నెల క్రితం ఉత్తర్వులు వచ్చిన నిలుపుదల చేసిన కమిషనర్
  • 30 రోజులకు మళ్లీ అవే పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు
  • బదిలీ అయిన సిఐలకు రిలీవ్ చేస్తారా లేదా అని అనుమానాలు

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ సిసిఆర్బిలో పనిచేస్తున్న శ్రీనివాసరాజును నిజామాబాద్ నగర సిఐ గా నియమించారు. నిజామాబాద్ నగర సిఐ గా పనిచేస్తున్న నరహరిని ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఐజి కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రఘుపతిని నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా అక్కడ పనిచేస్తున్న విజయ్ బాబును బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నియమించారు. బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న కోలా నరేష్ కుమార్ ను మల్టీ జోన్ వన్ ఐదు కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు గత నెలలో ఐదుగురు సిఐల బదిలీ ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆనాడు పొలిటికల్ ప్రెజర్ తో పోస్టింగులు తెచ్చుకున్నారని ఇక్కడ పనిచేస్తున్న సిఐలను బది అయినప్పటికీ రిలీవ్ చేయలేదు. కానీ నెల రోజుల్లోనే సీన్ రివర్స్ అయింది. నెల రోజుల క్రితం వెలువడిన ఐదుగురు సిఐల బదిలీ ఉత్తర్వులను యధాతధంగా విడుదల చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కు పొలిటికల్ సర్కిల్ తో అంతగా పడదని, ముక్కుసూటి మనిషి అని పేరు ఉంది. అలాంటి సమయంలో జరిగిన ఐదుగురు సిఐల బదిలీలు నెల రోజుల తర్వాత యధాతధంగా అమలు చేయడం వెనుక సిపి పై పొలిటికల్ ప్రెషర్ పెరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గురువారం వెలువడిన ఉత్తర్వులు అమరవుతాయో లేదో తెలియాలి అంటే ప్రస్తుతం పని చేస్తున్న సీఐలకు రిలీవ్ ఇస్తారా లేదా అని చర్చ మళ్ళీ మొదలైంది.

More articles

Latest article