26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మంత్రి పొన్నంను కలిసిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీంనగర్ జిల్లా  కేంద్రంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి మండలంలోని పలు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అన్ని విషయాలకు సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  గుండాడి రామ్ రెడ్డి,డైరెక్టర్ మేండే శ్రీనివాస్ యాదవ్ ,రవితేజ,కదిరే శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బాలకిషన్ గౌడ్, కదిరే నాంపల్లి గౌడ్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article