26.3 C
Hyderabad
Monday, August 3, 2026

గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీమ్

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీమ్ అని మోర్తాడ్ మండల  ఆదివాసి నాయక్ కోడ్ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి  జంబోతుల సాయన్న అన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామానికి చెందిన ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం సభ్యులు బుధవారం కొమరం భీమ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ నివాళులర్పించారు.  కార్యక్రమంలో ధర్మోరా గ్రామానికి చెందిన ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం రెండు సంఘాల సభ్యులు పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article