మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి దేవేందర్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. సంజీవ్ (నాగపురం) సంజీవ్ రూ.37,000, పౌడపల్లి గంగాధర్ రూ. 17,000, మద్ధికుంట రాజలింగంకు రూ. 27,000 చెక్కులను అందించడం జరిగింది. లబ్ధిదారులు ముత్యాల సునీల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్, ఆప్కా మహేష్,పిల్లి మహేష్,నరేష్,రఘు, రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

