26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సెప్టెంబర్ 30న ఛలో హైదరాబాద్ జయప్రదం చేయండి!

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ :  సెప్టెంబర్ 30 తేదీన భారీ ప్రదర్శన ధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో గురువారం ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్లను మూడు క్రిమినల్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, బీడీ కార్మికులకు 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్, జిపి నాయకులు చిన్నగంగాధర్,  జిపిమరియు ఆటో కార్మికులు బాజన్న, చాంద్ పాషా , మైనుద్దీన్ ,ఖాసీం ,గంగారాం, భాష తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article