27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రేషన్ డీలర్ నూతన అధ్యక్షునిగా అబ్దుల్ అజీమ్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్  : ఆర్మూర్ మండలంలోని 27రేషన్ షాపుల యజమానులు నూతన రేషన్ డీలర్ కార్యవర్గం  ఎన్నికలు గురువారం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ అజీం, కార్యదర్శిగా కామని నరేష్, కోశాధికారిగా పిప్రి శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ఎలాంటి సమస్యలు ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నూతన అధ్యక్షుడుగా తనను ఎన్నుకునందుకు ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా వారు ఆర్మూర్ ఎమ్మార్వో గజానన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రేషన్ డీలర్లకు స్విట్లను అందజేశారు.కార్యదర్శి కామని నరేష్, క్యాషీర్ పిప్రి శ్రీనివాసగౌడ్,ఎన్నికయారు ఈ కార్యక్రమంలో డీలర్లు బొడ్డు రమేష్, వెంకన్న, గుండెం రమేష్, కిషన్, హర్షద్,ఆశన్న, మగ్గిడి నర్సయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article