రేషన్ డీలర్ నూతన అధ్యక్షునిగా అబ్దుల్ అజీమ్
బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని 27రేషన్ షాపుల యజమానులు నూతన రేషన్ డీలర్ కార్యవర్గం ఎన్నికలు గురువారం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ అజీం, కార్యదర్శిగా కామని నరేష్, కోశాధికారిగా పిప్రి శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ఎలాంటి సమస్యలు ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నూతన అధ్యక్షుడుగా తనను ఎన్నుకునందుకు ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆర్మూర్ ఎమ్మార్వో గజానన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు....