29 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థుల తల్లులకు,పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలలో వచ్చే ప్రవర్తనా మార్పులు, వాటిని ఏవిధంగా సరిదిద్దాలి అనే విషయాలపై గ్రామంలోని కళ్యాణ పండపం లో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా స్వామి సులోచన, డీఎంఈ విద్యార్థుల తల్లులతో, విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పూదరి శ్యామల, గ్రామ విద్యాకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article