బీసీ రాష్ట్ర వ్యాప్త బంద్ లో పాల్గొన్న వామపక్ష నేతలు

0 14,649

నందిపేట్, బతుకమ్మ: పార్టీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌ నిర్వహించింది. ఈ బంద్‌కు నందిపేట్  మండల పరిధిలో ని అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలుగ్రామాల ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు  స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి.  వామపక్ష నేతలు మాట్లాడుతూ బంద్ విజయవంతం కావడం కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులు మంద మహిపాల్, బిఆర్ఎస్ పార్టీ మండల్ అధ్యక్షులు మాచర్ల సాగర్,బొడ్డు రాజశేఖర్, సిలెండర్ లింగం, నర్సాగౌడ్ నాయకులు వామపక్ష నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.