ఆరోగ్యకరమైన వెన్నెముక.. సురక్షితమైన శస్త్రచికిత్స

0 15,885
  • మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాధిత్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న వెన్నెముక దినోత్సవం అనస్థీషియా దినోత్సవం జరుపుకుంటారని మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాధిత్య తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాధిత్య, ఇప్పటివరకు విజయవంతంగా 300కి పైగా న్యూరో సర్జరీలు పూర్తి చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. “ఇప్పటి జీవనశైలిలో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, మొబైల్ మరియు ల్యాప్‌టాప్‌ల వాడకం అధికం కావడం వల్ల వెన్నెముక సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. వెన్నెముక నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. సరైన భంగిమలో కూర్చోవడం, వ్యాయామం చేయడం, సరైన బరువు నిర్వహించడం ద్వారా వీటిని నివారించవచ్చు” అని తెలిపారు. “శస్త్రచికిత్సల్లో అనస్థీషియా విభాగం పాత్ర ఎంతో ముఖ్యమైనది. రోగి సురక్షితంగా ఉండేందుకు అనస్థీషియా నిపుణుల సహకారం అత్యంత కీలకం. ఈ సందర్భంలో మెడికవర్ హాస్పిటల్స్ అనస్థీషియా నిపుణులు డా. వాను గారు చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను” అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ స్పైన్ డే సందేశాన్ని పాటించి, ఆరోగ్యకరమైన వెన్నెముకతో జీవించాలని డా. శ్రీకృష్ణాధిత్య, న్యూరో సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.