నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీపట్నం గ్రామంలోని ఒక ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్ఐ శ్యాంరాజ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.21600 నగదు, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మండల పరిధి లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు.
