23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు శ్రీ నయన్ ఎంపిక 

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ: ప్రతి గ్రామీణ విద్యార్థిలో ప్రతిభ దాగి ఉంటుందని దానిని గుర్తించి తర్ఫీదు ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ముప్కాల్ మండల విద్యాధికారి రవికుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్ 17 ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ విభాగంలో రేంజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  శ్రీ నయన్ రాష్ట్రస్థాయి కి  ఎంపిక కావడం సంతోష్ కరమైన విషయమని తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరువు లో జరిగె రాష్ట్రస్థాయి  పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

More articles

Latest article