27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకాట రాణుల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పొలీసులు కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు వందల మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయగా తొలిసారి పేకాట  రాణులను అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఒకటొ టౌన్ పరిధిలో  గల సరస్వతి నగర్ లోని నీలోఫర్ ఆస్రప్రతి నాలుగో అంతస్థులో పేకాట ఆడుతున్న  సమాచారం మేరకు ఒకటో  టౌన్ పోలీసులు బుధవారం రాత్రి రైడ్ చేశారు. గోదాదేవీ ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్న గుమ్మల సౌందర్య, ధర్మగడ్డ లత, కళావతి, రాచకొండ  గంగలు పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు. వారు  డబ్బులను పణంగా పెట్టి పేకాట ఆడుతున్నారని వారి వద్ద నుంచి రూ.15,100 స్వాధీనం చేసుకుని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. పట్టుబడిన మహిళా మణులంతా ప్రముఖ వైద్యుల సతీమణులని తెలిసింది.

More articles

Latest article