30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించిన టీఎన్జీవోస్ 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డికి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్ద టీఎన్జీవోస్ పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసిపుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లా ఉద్యోగుల సమస్యల పై ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రెవెన్యూ ఫోరం జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి, రెవెన్యూ ఫోరం జిల్లా సహాధ్యక్షులు శ్రీనివాస్ రావు, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, ఇందిర, శ్రీవేణి, విజయలక్ష్మి, సునీల్, స్వామి,మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, సలహాదారుల వనమాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article