27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

శబరిమల ఆలయంలో బంగారం లెక్కల్లో అవకతవకలు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని విగ్రహాల బంగారుతాపడం బరువు తగ్గడంపై కేరళ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.  బంగారం లెక్కల్లో అవకతకలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యనించింది. ఈవ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అలాగే ఈవివాదంపై ఇప్పటికే న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసి నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని బహిర్గతం చేయొద్దని పేర్కొంది. కాగా, శబరిమలలో గర్బగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగా రు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తామని దాతకు ముందకు రావడంతో ఈపనిని చెన్నైలో ఓ సంస్థకు అప్పగించారు. ఆసమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా రికార్డుల్లో ఉంది. అయితే ఈతాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు సంస్థ తెలిపింది.  మందుస్తు అనుమతి లేకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

 

More articles

Latest article