- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా లైసెన్స్ ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. జామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గల వారు ఆర్మ్స్ లైసెన్స్ పొందిన వారు సెక్షన్ 21 ఆఫ్ ఆర్మ్స్ యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని ఆర్మ్స్ లైసెన్స్ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్ ఆయుధాలను సంబంధింత పోలీస్ స్టేషన్లలో ఈనెల 9లోపు జమ చేయాలని తెలిపారు. ఎవరయిన లైసెన్స్ ఆయుధాలు జమ చేయనట్లయితే వారిపై ఆర్మ్స్ యాక్టు ప్రకారంగా చట్టరిత్య చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైతే అట్టి ఉత్తర్వుల నుండి మినహాయింపు పొందగోరుతారో వారు, నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు కార్యాలయంలోని సంబంధిత అధికారి కి రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
