27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

లాడ్జీలపై పోలీసుల దాడులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఒకటో టౌన్ పరిధిలోని లాడ్జీలపై సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించినట్లు ఎస్ హెచ్ ఓ బి.రఘుపతి తెలిపారు. లాడ్జీలలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఒకటో టౌన్ పరిధిలోని 20లాడ్జీలలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీలలో భాగంగా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక లాడ్జీలో వ్యభిచారం చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దీంతో లాడ్జీ మేనేజర్, విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైన ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఇన్స్ పెక్టర్, నలుగురు ఎస్ఐలు, 25మంది సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article