28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు

Must read

📰 Generate e-Paper Clip

  • ఒకరి మృతి.. ఇద్దరు యువకులకు గాయాలు..

 

బతుకమ్మ, బిక్కనూరు: అతివేగంగా వెళుతున్న కారు ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను అతివేగంగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందాగా మరో ఇద్దరు యువకులు గాయపడిన సంఘటన భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో లక్ష్మీ నగర్ తండా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. భిక్కనూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీ నగర్ తండా వద్ద ద్విచక్ర వాహనంపై సీతాఫలాలు పెట్టి బానోత్ శంకర్ (55) విక్రయిస్తుండగా, మరో ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి జంగంపల్లి వైపు నిశాంత్, మనోహర్  యువకులు వెళ్తుండగా అదే వైపు వెళ్తున్న బ్రీజా కారు అతివేగంతో ఈ రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనగా శంకర్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని, ఇద్దరి యువకులు గాయపడగా వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో  తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని భిక్కనూరు  ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Car hits two two-wheelers

Car hits two two-wheelers

More articles

Latest article