చైల్డ్ కేర్ నుంచి ఇద్దరు బాలల అదృశ్యం

0 15,448

బతుకమ్మ, పాల్వంచ: పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలోని ఓ సంస్థ సంరక్షణలో ఉన్న ఇద్దరు బాలలు అదృశ్యం అయ్యారని మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారన్నారు.  అక్టోబరు 1న 12 ఏళ్ల, 13 ఏళ్ల ఇద్దరు బాలలు కనిపించకుండా పోయారని పేర్కొన్నారు. సంస్థ నుంచే అదృశ్యమైనట్లు చెప్పారు. సంస్థ పర్సనల్ ఇన్​ఛార్జి బుక్యా శోభన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బాలల కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నట్లు ఎస్సై తెలిపారు. పిల్లల ఆచూకీ లభిస్తే 87126 86151 నంబరుకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

Leave A Reply

Your email address will not be published.